Nagarkurnool | నాగర్‌కర్నూల్ : కుక్క కరిస్తే వైద్యం కోసం దవాఖానకు వెళ్తాం.. కానీ కుక్కలే దవాఖానలో సంచరించడంతో రోగులు భయాందోళనకు గురైన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానలో చోటు చేసుకున్నది. స్థానిక జనరల్ దవాఖాన, ప్రాంగణంలో శుక్రవారం ఉదయం గ్రామ సింహాలు స్వైర విహారం చేశాయి.
సుమారు ఏడు వీధి కుక్కలు దవాఖానలోకి ప్రవేశించాయి. ఒకేసారి గుంపులు.. గుంపులుగా ఆస్పత్రిలోకి వచ్చిన శునకాలు ఓపీ రూమ్ ముందు సంచరించాయి. చాలా సేపు ఓపీ రూమ్ ముందే నిలబడిపోయాయి. ఆ తర్వాత దవాఖాన పరిసరాల్లో సంచరిస్తూ రోగులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుక్క కనిపిస్తేనే భయానికి గురయ్యే మనిషి ఏకంగా గుంపులుగా దవాఖానలోకి రావడంతో బెంబేలెత్తి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయినా వాటిని తరిమివేయకపోవడంతో రోగులు, వారి బంధువులు, అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోపల వీధి కుక్కల సైర్య విహారం
పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది.. భయంతో వణికిపోతున్న రోగులు. pic.twitter.com/M8QfHvY3kT
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2024
ఇవి కూడా చదవండి..
Ration Cards | అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్‌కార్డులు.. దరఖాస్తు ఎక్కడ చేయాలి? ఎవరు చేయాలి?
Liquor Price | త్వరలో మద్యం ధరల పెంపు? చక్రం తిప్పుతున్న పొరుగు రాష్ట్రపు అనుంగుడు