Ration Cards | అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్‌కార్డులు.. దరఖాస్తు ఎక్కడ చేయాలి? ఎవరు చేయాలి?
Ration Cards | కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు
- స్వీకరణకు ప్రభుత్వ నిర్ణయం
- సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు
Ration Cards | హైదరాబాద్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ) : కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్‌కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.
సవాలక్ష సందేహాలు…
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి అనేక సందేహాలపై స్పష్టత ఇవ్వలేదు. దరఖాస్తులు తీసుకోవాలన్న ప్రభుత్వ ప్రకటనపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
- దరఖాస్తులకు చివరి గడువుపై ఎలాంటి స్పష్టత లేదు.
- దరఖాస్తు ఎక్కడ, ఎలా చేయాలి? అనే అంశంపై స్పష్టత లేదు.
- మీ-సేవలో చేసుకోవాలా..? లేక ప్రజాపాలన మాదిరిగా దరఖాస్తులు స్వీకరిస్తారా..?
- దరఖాస్తు ఎవరు చేసుకోవాలనే అంశంపై స్పష్టత లేదు. డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే రేషన్‌కార్డులు ఉన్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవాలా..? లేక రేషన్‌కార్డు లేనివాళ్లు మాత్రమే దరఖాస్తు చేయాలా..?
- ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ దరఖాస్తు చేయాలా..?
- అవసరం లేదా..? అనే దానిపై క్లారిటీ లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

