అలంపూర్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dogs) స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. రోడ్లపైకి రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీసులపై వీధి కుక్కలు దాడికి(Stray dogs attack on police) పాల్పడ్డాయి. అలంపూర్(Alampur) జోగులాంబ దేవస్థానంలో రాత్రి వీఐపీ బందోబస్తు కోసం వచ్చిన పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ బాషపై కుక్కలు దాడి చేయడంతో వారిని హాస్పిటల్కు తరలించారు.
కాగా, అలంపూర్లో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, కుక్కలను నివారించాలని భక్తులు కోరుతున్నారు. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్లే పాదయాత్ర భక్తులు వెంట తెచ్చుకున్న కుక్కలను తుంగభద్ర నది, నల్లమల అడవి ఉన్నందున ఇక్కడే వదిలేస్తున్నారు. దీంతో కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను అరికట్టాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | పోలీసు అమరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదు: కేటీఆర్
KTR | రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్
Group-1 Mains | భారీ బందోబస్తు నడుమ.. నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు