మూసీ నదిపై ఆరు బ్రిడ్జీలను కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అసెంబ్లీలో కొనియాడారు. ఈ బ్రిడ్జీలతో ప్రజల ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపారు.
మరో రెండు బ్రిడ్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయాలని కోరారు. బీజాపూర్- హైదరాబాద్ రహదారిపై అండర్‌పాస్‌లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.