శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 12:58:41

తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. వాస్తవానికి గత రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల  ముసురు కురుస్తున్నది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి మొదలైన వాన బుధవారం సాయంత్రం దాకా కురిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. logo