మహబూబ్నగర్ : మహబూబ్నగర్(Mahbubnagar) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తపై కత్తితో(Attacked aunt )విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన దేవరకద్ర మండలం గుదిబండలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్యను కాపురానికి పంపడంలేదని ఓ వ్యక్తి ఆగ్రహంతో భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అత్తకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమం మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.