కట్టంగూర్, ఫిబ్రవరి 14 : సామాజిక సేవతో పాటు వ్యవసాయ రంగాల్లో చేస్తున్న విశేష సేవలకు గానూ నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శ్రేష్ఠ ఆగ్రో ఫెర్టిలైజర్ యజమాని బిల్లిపల్లి నరేందర్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ లభించింది. సవాక్స్ క్రాప్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ రైతులకు అందిస్తున్న సేవలతో పాటు సమాజ సేవలో ముందుండడం వంటి కార్యక్రమాలను గుర్తించిన చెన్నై గ్లోబల్ హ్యూమన్ పీస్ విశ్వవిద్యాలయం నరేందర్ రెడ్డికి ఈ పురస్కారాన్ని అందజేసింది. శనివారం యూనివర్సిటీ (జీహెచ్పీయూ)లో నిర్వహించిన కార్యక్రమంలో నరేందర్ రెడ్డి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ మాన్యుయేల్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా రైతులు, వ్యాపార వర్గాలు నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.