‘కుటుంబ అంశాలు కలబోసిన భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రమిది. నిజజీవిత సంఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాల్ని రాసుకున్నా. ఈ స్టోరీ ట్రీట్మెంట్తో పాటు సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి’ అన్నారు దర్శకుడు అజయ్‌భూపతి. ఆయన నిర్ధేశకత్వంలో మహేష్‌బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. రషా తడానీ కథానాయికగా నటించింది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు అజయ్‌భూపతి పాత్రికేయులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.