సోలో హీరోగా పదేళ్ల విజయవంతమైన సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు విజయ్ దేవరకొండ. సోలో హీరోగా ఆయన నటించిన తొలి చిత్రం ‘పెళ్లిచూపులు’ విడుదలై పదేళ్లవుతున్నది. 2016 ఆగస్ట్ 29 న విడుదలైన ఈ సినిమా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ దశాబ్ద కాలంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదిగారు విజయ్ దేవరకొండ. తనదైన ైస్టెల్, ఛరిష్మాతో యువతలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. టాక్సీవాలా, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, ఖుషి, కింగ్డమ్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
హీరోగా రాణిస్తూనే ‘ది దేవరకొండ ఫౌండేషన్’తో సేవా కార్యక్రమాల్ని చేపడుతూ అందరి మన్ననలందుకుంటున్నారు. ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లాలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించి సేవా భావాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ‘రౌడీ జనార్ధన’ భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శకుడు శౌర్యువ్‌తో కూడా ఓ సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తుండటం విశేషం.