గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 01:54:01

మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి గంగుల

మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి గంగుల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ధాన్యం కొనుగోలుకు సహకరించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మిల్లర్లను కోరారు. మిల్లర్ల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని భరోసాఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై గురువారం మిల్లర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్‌లో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేయాలని నిర్ణయించామని, 6,467 కేంద్రాలను ఏర్పాటుచేయనున్నామని మంత్రి చెప్పారు.1,071 కేంద్రాలను ఏర్పాటుచేసి, గురువా రంవరకు 3.15కోట్ల విలువైన 16,702టన్నుల ధాన్యాన్ని కొన్నట్టు తెలిపారు. 

దాడి కేసులో మంత్రి గంగులకు ఊరట 

మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రత్యేకకోర్టులో ఊరట లభించింది. 2013లో విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయంపై గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, సుద్దాల దేవయ్య తదితరులు దాడిచేశారని కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.విచారించిన నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక న్యాయస్థానం నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తూ గురువారం ఆదేశాలు జారీచేసింది.