సంగారెడ్డి : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer couple) దంపతులు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. సందీప్, కీర్తి అనే దంపతులు కుటుంబ కలహాలతో విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.