హైదరాబాద్: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. శిబు సోరెన్ మరణం కేవలం వ్యక్తిగతంగానే కాకుండా.. న్యాయం, గుర్తింపు, అచంచలమైన నిబద్ధత కలిగిన శకానికి ముగింపు. గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారానికి పోరాడిన యోధుడు సోరెన్ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ గందరగోళ పరిస్థితుల్లో సోరెన్ తమకు అండగా నిలిచారని చెప్పారు. కీలకమైన దశలో తమ ఆందోళనలకు సంఘీభావం తెలపడం మాకు అదనపు బలాన్ని ఇచ్చిందన్నారు. సోరెన్ దార్శనికత, విలువలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆయన కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
‘భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి, గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం అవిశ్రాంత పోరాట యోధుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణం నాకు తీవ్ర బాధను కలిగించింది. ఆయన మరణం కేవలం వ్యక్తిగత నష్టం కాదు. ఇది న్యాయం, గుర్తింపు, గౌరవం పట్ల అచంచలమైన నిబద్ధతతో ఏర్పడిన ఒక శకానికి ముగింపును సూచిస్తుంది.
తెలంగాణ ఉద్యమ గందోరగోళ పరిస్థితుల్లో అరుదైన దృఢ నిశ్చయంతో మాకు తోడుగా నిలిచారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో ఆయన సంఘీభావం, తెలంగాణ ఆందోళనకు నైతిక ప్రోత్సాహం కీలకమైన సమయంలో మాకు బలాన్ని ఇచ్చాయి. జార్ఖండ్ కోసం ఇదే మార్గంలో నడిచినందున ఆయన తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబం తరపున హేమంత్ సోరెన్, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. శిబు దార్శనికత, విలువలు మన సమిష్టి మనస్సాక్షిలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
I am deeply saddened by the passing of Former Jharkhand Chief Minister Sri Shibu Soren ji, a towering figure in Indian politics and a tireless crusader for tribal rights and regional self-determination. His demise is not just a personal loss—it marks the end of an era shaped by…
— KTR (@KTRBRS) August 4, 2025
Shibu Soren | జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
Chain Snatched | మార్నింగ్ వాక్ చేస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు