Chain Snatche | చైన్ స్నాచర్ల (Chain Snatchers) ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ (Congress MP) మెడలోని చైన్‌ను ఓ దొంగ లాక్కెళ్లాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో చోటు చేసుకుంది.
తమిళనాడు రాష్ట్రం మైలదుత్తురై ఎంపీ (Mayiladuthurai MP) సుధా రామకృష్ణన్ (Sudha Ramakrishnan) ఢిల్లీలో మార్నింగ్ వాక్ (Morning Walk) చేస్తున్న సమయంలో ఓ దొంగ ఆమె చైన్‌ను లాక్కెళ్లాడు. ఈ ఘటనపై ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాణక్యపురి (Chanakyapuri) ప్రాంతంలోని మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయం 6:15 నుంచి 6:20 గంటల సమయంలో పోలాండ్ ఎంబసీ గేట్-3, గేట్-4 దగ్గర వాకింగ్ చేస్తున్నప్పుడు ఎదురుగా స్కూటీపై హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి తన మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఆమె లేఖ రాశారు. పటిష్ఠమైన భద్రత ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తన మెడపై గాయం అయినట్లు చెప్పారు. పోయిన గొలుసు నాలుగు తులాల కంటే ఎక్కువే ఉంటుందన్నారు. నేరస్థుడిని పట్టుకుని, నా బంగారు గొలుసు నాకు తిరిగి అప్పగించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని అమిత్ షాని ఎంపీ అభ్యర్థించారు.
Also Read..
Ceiling Collapses | పీవీఆర్ సినిమా హాల్లో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు
Shibu Soren | జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
KTR | ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం.. రాష్ట్రంలో యూరియా కొరతపై కేటీఆర్ ఫైర్