Ceiling Collapses | అస్సాం గువాహటి (Guwahati)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పీవీఆర్ సినిమా (PVR Cinemas) హాల్లో పైకప్పు కూలింది (Ceiling Collapses). ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు.
ఆదివారం రాత్రి ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) సినిమా ప్రదర్శన సమయంలో (Movie Screening) ఈ ఘటన చోటు చేసుకుంది. పైకప్పులోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో చిన్నారి సహా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో సినిమా హాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. హాల్లోని వారందరినీ అక్కడి నుంచి బయటకు తరలించారు. అనంతరం గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ఈ మేరకు సినిమా హాల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Shibu Soren | జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
KTR | ఇది రైతు ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం.. రాష్ట్రంలో యూరియా కొరతపై కేటీఆర్ ఫైర్
DK Shivakumar | కొందరు అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు: డీకే శివకుమార్