జనగామ : జనగామ(Jangama) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో(Private bus overturned) పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. రన్నింగ్‌లో బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతోనే అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు తెలిసింది. బస్సు బెంగళూరు నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటన బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు(eriously injured) కాగా, 23 మందికి స్వల్ప గాయా లయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన క్షత్రగాతులను జనగామ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, బస్సు బోల్తా పడటంతో సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.