Road Accident | మెదక్ : జిల్లాలోని శివంపేటలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
ఉసిరికపల్లి వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రహదారిపైన ఉన్న గుంతలో పడి గాల్లోకి ఎగిరిపడింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును కారు ఢీకొట్టి.. కాల్వలోకి పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను పాముబండ తండా, రత్నాపూర్, తాళ్లపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
IAS Officers | ఐఏఎస్ అధికారులకు చుక్కెదురు.. పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు
Harish Rao | తెలంగాణలో 8,490 ఎంబీబీఎస్ సీట్లు.. ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత : హరీశ్‌రావు