Harish Rao | హైదరాబాద్ : ఎంబీబీఎస్ చదువును గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద బిడ్డలు కూడా ఎంబీబీఎస్ చేసే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనను కొనియాడుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యకు హబ్‌గా మారిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. మెడికల్ సీట్ల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో లేని వైద్య విద్య ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 34కి చేరిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. 2014 వరకు తెలంగాణలో 2,850 మెడికల్ సీట్లు ఉంటే.. ప్రస్తుతం 8,490 సీట్లు ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈ ఆల్ టైమ్ రికార్డును ఎవరూ చెరిపేయలేరని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Telangana has become a hub for medical education.#Telangana leads the country in the number of medical seats.
Once out of reach, medical education has now become accessible to the common man.
During six decades of united Andhra Pradesh government, there were only 5 medical… pic.twitter.com/pyv5fUS2wD
— Harish Rao Thanneeru (@BRSHarish) October 16, 2024
ఇవి కూడా చదవండి..
IAS Officers | స్టే ఇస్తూ పోతే.. ఎన్నటికీ తేలదు.. ఐఏఎస్‌ల పిటిషన్లపై హైకోర్టు వ్యాఖ్యలు
TG Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం