KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఈ పది నెలల కాలంలో వేల సంఖ్యలో వివాహాలు జరగ్గా.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో లక్షలాది పెళ్లిళ్లు జరగబోతున్నాయి.. మరి తులం బంగారం మాట ఏంటని రేవంత్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా రేవంత్‌ను నిలదీశారు.
లక్షలాది లగ్గాలు జరిగే మ్యారేజ్ సీజన్ మళ్లా వచ్చింది.. ఈ సారి కూడా తులం బంగారం తూచ్ తూచేనా ముఖ్యమంత్రి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. శుభ ముహుర్తాలతో పెళ్లి సందడి మొదలైంది.. మరి మీ కల్యాణమస్తు కానుక అమలుకు సుముహూర్తం దొరకట్లేదా..? పది గ్రాముల పసిడి ఆశజూపి ఆడబిడ్డల ఓట్లు వేయించుకున్నావ్.. ఆడిన మాట తప్పి పచ్చని పందిళ్ల సాక్షిగా పచ్చి దగా చేస్తున్నావ్..! అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
కనకపు సింహాసనమున కూర్చున్నాక.. కనకం హామీని మర్చిపోయావా..? లంకె బిందెలు దొరకలేదన్న నైరాశ్యంతో నవ వధువులకు ఇవ్వాల్సిన పుత్తడిని ఎగ్గొట్టడం భావ్యమా..? పేదింటి పెండ్లి కూతుళ్లకు టన్నుల కొద్ది గోల్డ్ బాకీ పడ్డావ్ నీవు… ఒలింపిక్స్‌లో మోసాల పోటీలు పెడితే నీకు గోల్డ్ మెడల్ గ్యారెంటీ..! గట్టి మేళాలు మోగుతున్నాయి ..వట్టి మాటలు ఇంకెన్నాళ్లు.. గోల్డ్ షాపుల్లో స్టాక్ లేదా..? బంగారు గనుల్లో తవ్వకాలు ఆగిపోయినయా..? వాగ్దానం చేసి వంచించడం మంచిది కాదు.. ఆడబిడ్డలు బాధపడితే అరిష్టం.. ఈ సీజన్లోనైనా తులం బంగారం పథకాన్ని ప్రారంభించండి..! అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.
లక్షలాది లగ్గాలు జరిగే మ్యారేజ్ సీజన్ మళ్లా వచ్చింది..ఈ సారి కూడా తులం బంగారం తూచ్ తూచేనా ముఖ్యమంత్రీ ?
శుభ ముహుర్తాలతో పెళ్లి సందడి మొదలైంది.. మరి మీ కల్యాణ మస్తు కానుక అమలుకు సుముహూర్తం దొరకట్లేదా ?
పదిగ్రాముల పసిడి ఆశజూపి ఆడబిడ్డల ఓట్లు వేయించుకున్నావ్..ఆడిన మాట తప్పి… pic.twitter.com/y2dVUpSbvH
— KTR (@KTRBRS) October 16, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ప్రధానిని విమర్శించే దమ్ము సీఎంకు లేదు.. మోదీని చూస్తే రేవంత్ రెడ్డికి దడా : కేటీఆర్
KTR | ‘హైడ్రా’ వల్ల హైదరాబాద్‌లో భయానక వాతావరణం.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్