KTR | హైదరాబాద్ : హైడ్రా వల్ల హైదరాబాద్‌లో భయానక వాతావరణం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బిల్డర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
హైడ్రా వల్ల హైదరాబాద్ నగరంలో భయానక వాతావరణం ఏర్పడింది. మొన్న నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు కొట్టుకున్నారు. హైడ్రా పేరిట కాంగ్రెస్ నాయకులు వసూళ్లు చేస్తున్నారని ఎంఐఎం నేతలు కొట్టారు. కాంగ్రెస్‌కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కొట్టుకున్నారు. హైడ్రా పేరుతో బెదిరిస్తున్నారు.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకా చాలా మంది బిల్డర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దిక్కుమాలిన పరిపాలన వల్ల రియల్ ఎస్టేట్ దివాలా తీసింది. రిజిస్ట్రేషన్ రెవెన్యూ పడిపోయింది. అప్పు పుట్టడం లేదు.. అందుకే రుణమాఫీ చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అంటున్నారు. దివాలాకోరు మాటలు మాట్లాడితే ఎవడు అప్పుడు ఇస్తాడు..? మీ ముఖాలు చూసి అప్పు ఇవ్వరు. రాష్ట్ర ప్రగతి, పనితీరును చూసి అప్పులు ఇస్తారు. దివాలాకోరు మాటలు మాట్లాడి.. విధ్వంసం చేస్తామంటే అప్పులు పుట్టవు అని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో పర్యటనలు ప్రారంభిస్తున్నాం. ఎస్టీపీల నిర్మాణం పూర్తయి.. చివరి దశలో ఉన్న వాటని పరిశీలిస్తాం. అంబర్‌పేట, నాగోల్, ఉప్పల్, నాచారం, మల్కాజ్‌గిరిలో విజిట్ చేస్తాం. మహేశ్వరం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం ఫలితాలు కనబుడుతున్నాయి. ఆ ప్రాంతాలను కూడా విజిట్ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో హైడ్రా వల్ల గడగడ వణుకుతున్న ప్రతి బస్తీలోకి వెళ్తాం.. సమస్యలు ఉన్న ప్రతి చోటకు బీఆర్ఎస్ బృందం వెళ్తుంది.. ప్రజల్లో విశ్వాసం నింపుతాం.. అదే విధంగా న్యాయ పోరాటం చేస్తాం. లీగల్ సెల్ చాలా యాక్టివ్‌గా పని చేస్తోంది. 400 పైచిలుకు కుటుంబాలు తమ తరపున న్యాయ పోరాటం చేయమంటే.. వారి తరపున కొట్లాడుతున్నాం. ఇంకా అవసరమైతే లీగల్ సెల్‌ను బలోపేతం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ఎండగడుతాం. పేద ప్రజలను అవమానించే విధంగా మాట్లాడితే సహించం. పేద ప్రజలకు అండగా నిలబడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
Hyderabad | కిలోమీటర్ దాకా కూలగొడ్తరా.. మూసీ ఎఫ్టీఎల్, బఫర్ దాటి భూసేకరణకు సర్కార్ స్కెచ్