KTR | హైదరాబాద్ : బఫర్ జోన్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదట.. కానీ ఇల్లు తీసేసి మాల్ కట్టొచ్చట.. అదేం లాజిక్ అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరితారు. మల్లయ్య ఇంట్లో నుంచి మురికి నీరు వస్తది.. కానీ మాల్లో నుంచి సుగంధ ద్రవ్యం వస్తదా..? ఈ ద్వంద్వ వైఖరి ఏంటి..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకు మీరే కదా అనుతులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు చేసింది మీరే కదా..! ఇప్పుడు వాటిని కూలగొడితే రిజిస్ట్రేషన్ డబ్బులు రేవంత్ రెడ్డి తిరిగి ఇస్తాడా..? జీవో ఇచ్చాం పోండి అంటే ఎలా..? ఏ చర్చ లేకుండా, అనాలోచితంగా చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. మూసీ పరివాహక ప్రాంతానికి రా.. వాళ్ల ముందు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పు.. ఎలా మూసీ సుందరీకరణ చేస్తావు..? ఎలా అభివృద్ధి చేస్తావో చెప్పు..? ప్రజలను ఒప్పించి మెప్పించు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.
పాలన చేతగాక ఈ మాటలు.. ప్రభుత్వ పాఠశాలల్లో చాక్‌పీసులకు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులకు, గురుకుల భవనాలకు కిరాయిలు, తులం బంగారం ఇచ్చేందుకు, పెన్షన్లు, రుణమాఫీకి పైసల్లేవు. కానీ మూసీని లక్షా యాభై వేల కోట్లతో సుందరీకరణ చేస్తామంటున్నారు. వరద సహాయం చేస్తామన్నారు.. ఒక్క రూపాయి సహాయం చేశారా..? నెలన్నర అయింది. ఖమ్మం, మహబుబాబాద్లోని వరద బాధితులకు వారి ఖాతాల్లో రూ. 17500 వేస్తామన్నారు. వేశారా..? నీ ప్రాధాన్యత ఏంది.. పేద ప్రజల.. నీ ఖజానా నింపుకోవడమా..? ఢిల్లీ పెద్దలకు, మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు పంపడమే నీ పనా..? పేద ప్రజలను ఒప్పించకుండా మీ ఇష్టారీతిన పోతామంటే ప్రజల తరపున నిలబడి ఉంటాం. హడావుడి చేసి పేద ప్రజల హక్కులకు భంగం కలిగిస్తామంటే ఊరుకోం.. ప్రజల పక్షాన పోరాడుతాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రధానిని విమర్శించే దమ్ము సీఎంకు లేదు.. మోదీని చూస్తే రేవంత్ రెడ్డికి దడా : కేటీఆర్
KTR | ‘హైడ్రా’ వల్ల హైదరాబాద్‌లో భయానక వాతావరణం.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
KTR | కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శలు