మహబూబాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గిరిజనుల వ్యతిరేకి అని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod), తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. గురువారం మహబూబాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గిరిజనుల ఓట్లతో గెలిచి, వారినే అణచివేస్తున్నాడని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో గిరిజన రైతులపై దాడి చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా మానుకోటలో ధర్నా నిర్వహిస్తామనగానే సీఎంకు సెగ తగిలిందన్నారు.
అందుకే అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలనపై ఊరూరా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ, ఎంపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత, శంకర్ నాయక్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read..
AR Rahman | రెహమాన్ – సైరా భాను విడాకుల విషయంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు : లాయర్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
Nayanthara | నయనతార డాక్యుమెంటరీకి నెట్‌ఫ్లిక్స్ అన్ని కోట్లు చెల్లించిందా..?