Nayanthara | లేడి సూపర్‌స్టార్ డాక్యుమెంటరీ నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ నెల 18న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. అయితే, నాన్ రౌడీ దాన్ మూవీలోని ఆఫ్ స్క్రీన్ క్లిప్పింగ్ విషయంలో వివాదం నెలకొన్నది. ఈ వ్యవహారంలో తమిళ స్టార్ నటుడు ధనుష్ రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. ఈ నోటీసులు ఇచ్చిన ధనుష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్ సినీ నేపథ్యం నుంచి వచ్చారని, తాను మాత్రం ఎన్నో కష్టాలుపడి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొంది. మూడు సెకెన్ల వీడియోకు రూ.10కోట్ల పరిహారం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ధనుష్ అనుమతి కోసం ఎన్నో రోజులు ఎదురుచూశామని చెప్పింది. అయితే, ధనుష్ నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటానంటూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేశ్, నజ్రియా నజీమ్‌తో పాటు పలువురు హీరోయిన్లు మద్దతు ప్రకటించారు. ఇక డాక్యుమెంటరీలో ఏం చదివింది.. తనకి మొదటి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఫ్యామిలీ గురించి, గజినీ సమయంలో తనను ఎలా బాడీ షేమింగ్ చేశారు.. దానికి ఎంత బాధపడిందో వివరించారు. అలాగే, బిల్లా సినిమాలో బికినీ సీన్, శ్రీరామరాజ్యం సినిమా చేస్తున్న సమయంలో వచ్చిన విమర్శలు.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయాలను వివరించింది. మొదటి తమిళ్ సినిమా నిర్మాత, రాణా, నాగార్జున, శ్రీరామరాజ్యం సినిమాకు వర్క్ చేసిన టెక్నిషియన్, డైరెక్టర్ అట్లీతో పాటు పలువురి గురించి వ్యాఖ్యానించింది.
నయనతార ఈ డాక్యుమెంటరీ చర్చనీయాంశమైంది. మొదటిభాగం పర్వాలేదనిపించినా.. సెకండాఫ్ మాత్రం అదిరిపోయే సన్నివేశాలతో ఉందని.. అయితే పలు సీన్స్ వర్కవుట్ కాలేదని పలువురు పేర్కొన్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో తన డాక్యుమెంటరీని నయనతార కోట్లకు విక్రయించిందని తెలుస్తున్నది. డాక్యుమెంటరీని రూ.20 నుంచి రూ.30కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇప్పటి వరకు డాక్యుమెంటరీకి ఎంత చెల్లించామన్నది నెట్‌ఫ్లిక్స్ చెప్పలేదు.