Sabitha Indrareddy | తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితారెడ్డి (Sabitha Indrareddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathore)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలియజేశారు.
హాస్టల్ తనిఖీలు చేస్తే ప్రభుత్వం బండారం బయటపడుతుందని భయమా..? అని ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ప్రభుత్వ వైఫల్యం కనడుతోందని మండిపడ్డారు. జగిత్యాలలో 48 మంది అస్వస్థతకు గురైతే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందన్నారు. తాండూరులో 15 మంది పిల్లలు అస్వస్థతకు గురైతే తల్లిదండ్రులను హాస్టల్ లోనికి అనుమతించలేదు. విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా హాస్టల్లోనే చికిత్స చేయించడమేంటి..? అని ప్రశ్నించారు.
KTR | రేవంత్.. మీది ప్రభుత్వమా.. అబద్ధాల ఫ్యాక్టరీనా?: కేటీఆర్
KTR | ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి: కేటీఆర్