హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీయా అని ప్రశ్నించారు. అర్ధసత్యాలు, అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని మండిపడ్డారు. కాకిలెక్కలతో ప్రజలను మోసగించడమే మీ విధానమా అంటూ నిలదీశారు. తెలంగాణ అప్పు ఎంత ఉందో ఆర్బీఐ గణాంకాలను బట్టి తెలుస్తుందన్నారు. అబద్ధానికి అంగీ లాగు వేస్తే రేవంత్ అని మరోసారి నిరూపించుకున్నారంటూ మండిపడ్డారు.
‘రేవంత్.. మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?
మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం..
అర్దసత్యాలు..అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు!
కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా?
50 వేల కోట్లు, 65 వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం?
RBI Handbook of India States బట్టి తెలంగాణ అప్పు ఎంత వుందో తేటతెల్లమవుతుంది!
ఢిల్లీకి మూటలు మూసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగు లాగీ వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు!
Lies, more lies and nothing but LIES!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
రేవంత్….మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?
మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం..
అర్దసత్యాలు..అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు!
కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా?
50 వేల కోట్లు, 65 వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం?
RBI Handbook of… https://t.co/gV0Lnu29OG
— KTR (@KTRBRS) December 12, 2024