Road Accident | వరంగల్ : వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ మూడు ముక్కలైంది. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడగా, మరో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు అతి వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ట్రాక్టర్ డ్రైవరుకు తీవ్ర గాయాలు
వరంగల్ – వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద ఇసుక ట్రాక్టరును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మూడు ముక్కలైన ట్రాక్టర్
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు.. ట్రాక్టర్ డ్రైవరుకు తీవ్ర గాయాలు కాగా.. బస్సు డ్రైవర్,… pic.twitter.com/zzeiaI0hEe
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2024
ఇవి కూడా చదవండి..
KTR | బతుకమ్మ, దసరా వేళ.. భయానక వాతవరణం సృష్టించారు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం