KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో బతుకమ్మ( Bathukamma ) బతుకమ్మ లాగా లేదు.. దసరా( Dasra ) దసరా లాగా లేదు.. ఈ పండుగల వేళ బుల్డోజర్లతో భయానక వాతావరణం సృష్టించారని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ సహా ఆయన అనుచరులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి. ఈ సారి పండుగ… పండుగ మాదిరిగా లేకుండా పోయింది. రాష్ట్రంలో పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారు. వరంగల్‌లో ఓ ఎమ్మార్వో బతుకమ్మ ఘాట్ చూసేందుకు వెళితే ఇళ్లు కూలగొట్టేందుకు వచ్చారనుకొని వాళ్లను స్థానికులు తరమికొట్టారట. అలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అని కేటీఆర్ తెలిపారు.
యూపీలోనే బుల్డోజర్ సీఎం ఉన్నాడుకున్నాం. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పడు అలాంటి బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆఘాయిత్యాలను చూసి ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ను తలచుకుంటున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ పది నెలల వాళ్ల పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్ డే రోజునే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు కాలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..