KTR | ప్రజా ధనాన్ని తగలేసి.. ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్దాలతో ప్రకటనలా..? రేవంత్‌ను నిలదీసిన కేటీఆర్
KTR | నిత్యం అబద్దాలు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తున్నదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
KTR | హైదరాబాద్ : నిత్యం అబద్దాలు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తున్నదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలో తప్పుడు ప్రకటనలు ఇచ్చిన రేవంత్ సర్కార్‌పై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. ప్రజా ధనాన్ని తగలేసి…ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా..? గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా..! తెలంగాణ యువతను పిచ్చోళ్లను చేస్తున్నావా…? అశోక్ నగర్ చౌరస్తాకు.. ఉస్మానియా క్యాంపస్‌కు పోయి చెప్తావా.. నీ కొలువుల పండుగ కథలు..? ఏడాదిలో 2 లక్షల కొలువులు గ్యారెంటీ అని.. నిరుద్యోగుల చెవుల్లో పువ్వులు పెట్టింది చాలక.. తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించడం దుర్మార్గం..! అని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తున్నది..!
నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా..?
ప్రజా ధనాన్ని తగలేసి…ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా..?
గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా..!
తెలంగాణ యువత ను…
— KTR (@KTRBRS) October 9, 2024
ఇవి కూడా చదవండి..
Speed Post | పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యం.. యువకుడికి చేజారిన ఉద్యోగం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

