Hyderabad | భార్య చేస్తున్న అవినీతిని బయటపెట్టాడో భర్త. హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీ డీఈఈగా పనిచేస్తున్న తన భార్య లంచాలకు మరిగి రోజూ లక్షల రూపాయలను ఇంటికి తీసుకొస్తుండటంతో తట్టుకోలేకపోయాడు. అవినీతి సంపాదనను మానుకోవాలని వారించాడు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో ఆమె అవినీతిని బయటపెట్టాడు. తన భార్య అక్రమ సంపాదనకు సాక్ష్యాలివే అంటూ ఇంట్లో దాచిపెట్టిన డబ్బుల కట్టల వీడియోను తీసి బయటకు రిలీజ్ చేశాడు.
మణికొండలోని మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి కొంతకాలంగా భారీగా అవినీతి చేస్తున్నది. వివిధ పనుల నిమిత్తం తన ఆఫీసుకు వచ్చే వాళ్లను టార్గెట్ చేసి వారి నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో భారీగా డబ్బులను తీసుకుంటున్నది. ఇలా ప్రతిరోజు లక్షల రూపాయలను ఇంటికి తీసుకొస్తున్నది. అలా తీసుకొచ్చిన డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచి పెడుతున్నది. దీంతో దివ్యజ్యోతిని ఆమె భర్త శ్రీపాద్ వారించాడు. అవినీతి మార్గంలో సంపాదించవద్దని సూచించారు. అయితే లంచం తీసుకోవద్దని ఎంత చెప్పినా భర్త మాటను పెడచెవిన పెట్టింది.
భార్య దివ్యజ్యోతి అవినీతిని చూసి తట్టుకోలేక వేదన చెందిన భర్త శ్రీపాద్ ఆమెకు షాకిచ్చాడు. ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బును దాచిపెట్టిందో వీడియోలు తీసి మరీ భార్య అవినీతిని బయటపెట్టాడు. తన భార్య తీసుకుంటున్న లంచాలకు ఇవే సాక్ష్యాలను చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దివ్యజ్యోతి అవినీతి తెలిసి ఇప్పుడు అంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త శ్రీపాద్
మనికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న దివ్యజ్యోతిని మీడియాకు పట్టించిన భర్త శ్రీపాద్.
ప్రతి రోజు తన భార్య దివ్యజ్యోతి అక్రమంగా లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని, తప్పంటే నన్ను తిట్టేదని వీడియోలు తీసి… pic.twitter.com/dz6v5sXsCe
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2024