Journalist Arrest | వరంగల్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసుల పరంపర కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారని జర్నలిస్టును అక్రమంగా అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారని గురువారం రాత్రి 11 గంటల సమయంలో RGTV జర్నలిస్ట్ రాజ్ కుమార్‌ని వర్ధన్నపేట ఏఎస్ఐ రాజు పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. రాత్రి 11:30 గంటల సమయంలో రాజకుమార్‌ని కస్టడీలోకి తీసుకుంటున్నామని, వీడియోలు తీయనియకుండా, మాట్లాడినీయకుండా కారులో ఎక్కించుకొని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నుండి జాఫర్ గాడ్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అక్కడి నుండి పాలకుర్తికి తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు.. ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా రాజకుమార్ ఆచూకీ లేని పరిస్థితి ఉందని ఆర్జీటీవీ సిబ్బంది పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వీడియోలు చేస్తున్నారని జర్నలిస్ట్ అక్రమ అరెస్ట్
రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వీడియోలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారని రాత్రి 11 గంటల సమయంలో RGTV జర్నలిస్ట్ రాజ్ కుమార్‌ని పోలీస్ స్టేషన్‌కి పిలిచిన ఏఎస్ఐ… pic.twitter.com/QA8DkBKQwO
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2025
ఇవి కూడా చదవండి..
Jangaon | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
Harish Rao | వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీశ్‌రావు