మహదేవపూర్/కాళేశ్వరం/కన్నాయిగూడెం, ఆగస్టు 8 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు(Medigadda barrage) వరద(Reduced flood) తగ్గుతోంది. గురువారం 3,30,830 క్యూసె క్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రవా హం రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 92.60 మీటర్ల ఎత్తులో ఉంది. అదేవిధంగా అన్నారం బరాజ్‌కు మానేరు, కాల్వల ద్వారా 4500 క్యూసెక్కుల నీరు వస్తుండగా, మొత్తం 66 గేట్లు ఎత్తి దిగువకు వదులుతు న్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది.