Ration Cards | నర్సింహులపేట, ఫిబ్రవరి 8 : ప్రజా పాలనలో, కులగుణన సర్వేలో, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మరోసారి రేషన్ కార్డు కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీతో వివిధ గ్రూపుల్లో మేసేజ్లు పెట్టారు. మీసేవ ద్వారా రేషన్ కార్డుల జారీ కోసం అప్లికేషన్లు తీసుకోవడానికి మీసేవ ద్వారా ప్రాసస్ ఓపెన్ చేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మేసేజ్లు చేశారు.
శుక్రవారం రాత్రి ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో శనివారం మీసేవలకు ప్రజలు వచ్చే సమయానికి ముందే ఫుడ్ సెక్యూరిటీ కార్డు కోసం దరఖాస్తు చేసే సైట్ ఓపెన్ కావడం లేదు. ఫుడ్ సెక్యూరిటీ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదని కంప్యూటర్ వెబ్సైట్లో వచ్చింది. దీంతో దరఖాస్తు కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మీసేవ నిర్వహకులు గ్రూప్లో మేసేజ్లు పెట్టడంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు వెనుతిరిగి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి..
Warangal DTO | వరంగల్ డీటీఓగా శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు!
Kaleswaram | కాళేశ్వరంలో వైభవంగా రెండో రోజు మహాకుంభాభిషేక ఉత్సవం..!