Warangal DTO | కరీమాబాద్: వరంగల్ జిల్లా రవాణా అధికారి గంధం లక్ష్మి విధుల నుండి సస్పెన్షన్కు గురయ్యారు. ఆమె స్థానంలో అదే కార్యాలయంలో పని చేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్ శోభన్ కుమార్కు డిటిఓ వరంగల్ గా పూర్తి ఆదనవు బాధ్యతలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించినందుకు జిల్లా రవాణా అధికారి గంధం లక్ష్మిను ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర రవాణా కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.