హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan) ఫైర్ అయ్యారు. హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులకు నిరసనగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రశ్నిస్తే పౌడి కౌశిక్ రెడ్డిపై(Padi Kaushik Reddy) నాలుగు తప్పుడు కేసులు పెట్టారు. బీఆర్ఎస్ నాయకులను వేధించేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. మరో వైపు తనపై ఎవరు దాడి చేయలేదని సంజయ్ చెబుతున్నారు.
అలాంటప్పుడు కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టే అధికారం వారికి లేదన్నారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మా మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనపై ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Nizamabad | నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు
Fertilizers | తెలంగాణలో మళ్లీ మొదలైన ఎరువుల కోసం బారులు
Adiabad | రైతు భరోసా రూ.15,000 ఇవ్వాలని బీఆర్ఎస్ నిరసన