రాజన్న సిరిసిల్ల : ఏ ముహుర్తాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కానీ ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యూరియా కోసం సొసైటీల ఎదుట బారులు కడుతున్నారు. చెప్పులు క్యూలైన్లో పెట్టీ మరీ పడిగాపులు కాస్తున్న దారుణ పరిస్థితులు నిత్య కృత్యమవుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల(Fertilizers) జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గుండారం గ్రామంలో ఎరువుల కోసం ఆధార్ కార్డులు లైన్లో పెట్టి రైతులు నిలుచున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుంటే అరకొరగానే ఎరువులు ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో సొసైటీల్లో యూరియా అవసరమైన మేర సరఫరా జరిగేదని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి మందా జగన్నాథం : కేటీఆర్
HMPV Case | మరో చిన్నారికి HMPV పాజిటివ్.. భారత్లో 18కి చేరిన కేసులు