Rains | హైదరాబాద్ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం తెలంగాణపై కూడా చూపనుంది. దీంతో రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో బుధవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లో పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. నల్లగొండ జిల్లా మాటూరులో 1.1 సెం.మీ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1.1 సెం.మీ వర్షం కురిసింది.
వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు క్రమంలో బలహీనపడుతుందని అంచనాలు ఉన్నాయి. ఇక, తీవ్ర అల్పపీడనం కారణంతో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులకు పైగా వదలకుండా, విడవకుండా ఉన్న ముసురు రైతులకు ముప్పుగా మారింది.
ఇవి కూడా చదవండి..
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన మేడే రాజీవ్ సాగర్
Vinod Kumar | ఆ తప్పును సవరించండి.. బీఎస్ఎన్ఎల్ సీజీఎంకు మాజీ ఎంపీ వినోద్ లేఖ
Jagtial | ఆస్తి కోసం తల్లిలా ఆదరించారు.. కానీ మృతదేహాన్ని తాకేందుకు నిరాకరించారు..