Vinod Kumar | హైదరాబాద్ : తాజాగా దేశంలో రోజురోజుకు సైబర్‌క్రైం కేసులు పెరుగుతూ పోతున్నాయి. వీటిని అరికట్టేందుకు గాను, ప్రజలను జాగృత పరిచేందుకు గాను ప్రస్తుతం నెట్‌వర్క్‌లు ఫోన్‌రింగ్ కావడానికి ముందు ప్రజలకు ఒక సమాచారాలను అందిస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.
ఆ సమాచారం ఏమంటే… ‘మీకు పోలీసులు, జడ్జిలు, వీడియో కాల్స్ చేస్తూ సైబర్ క్రైంలకు పాల్పడవచ్చు, అలాంటి కాల్స్ మీకేమైనా వస్తే వెంటనే అప్రమత్తమై సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వండి’ అంటూ వినిపిస్తున్నది. అయితే, అందులో ‘జడ్జిలు, పోలీసులే నేరుగా వీడియో కాల్ చేసి సైబర్ క్రైంలకు పాల్పడవచ్చు’ అనే అర్థం వస్తున్నది. ‘పోలీసులు, జడ్జిల పేరిట’ అని రావాల్సిన సమాచారం తప్పుగా వస్తున్నది. ఆ తప్పును సవరించండి అని హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బీఎస్ఎన్ఎల్ సీజీఎంకు వినోద్ కుమార్ లేఖ రాశారు. ఈ సమాచారం జడ్జిలను, పోలీసు అధికారులను కించపరిచే విధంగా ఉన్నది. ఈ తప్పుడు సమాచారాన్ని సరిచేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మొబైల్ నెట్‌వర్క్‌ల కంపెనీలను కోరుతున్నాను అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jagtial | ఆస్తి కోసం తల్లిలా ఆదరించారు.. కానీ మృతదేహాన్ని తాకేందుకు నిరాకరించారు..
Tollywood | రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. వేదిక ఇదే..!