Jagtial | ఆస్తి కోసం తల్లిలా ఆదరించారు.. కానీ మృతదేహాన్ని తాకేందుకు నిరాకరించారు..
Jagtial | ఆస్తుల కోసం ఆమెను తల్లిలా ఆదరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన ఆమెను తాకేందుకు నిరాకరించారు. రోడ్డుపైనే మృతదేహాన్ని వదిలేసి మానవత్వం లేకుండా ప్రవర్తించారు.
Jagtial | జగిత్యాల : ఆస్తుల కోసం ఆమెను తల్లిలా ఆదరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన ఆమెను తాకేందుకు నిరాకరించారు. రోడ్డుపైనే మృతదేహాన్ని వదిలేసి మానవత్వం లేకుండా ప్రవర్తించారు. ఈ అమానుష ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తీన్ఖనికి చెందిన సాదుల సత్తమ్మ (85), లక్ష్మణ్ దంపతులు. వీరికి పిల్లలు లేరు. సత్తమ్మ భర్త లక్ష్మణ్ ఇరవై ఏండ్ల క్రితం మృతి చెందాడు. అయితే సంతానం లేకపోవడంతో తన భర్త లక్ష్మణ్ తమ్ముడి కొడుకులైన ప్రసాద్, రవి ఇద్దరికి ఆస్తులు పంచి వారి వద్దే ఉంటున్నది. సత్తమ్మను వారిద్దరూ వంతుల వారీగా పోషిస్తున్నారు. అయితే ఇటీవల అనారోగ్యంతో దవాఖానలో చేరిన ఆమె, మంగళవారం రాత్రి మృతిచెందింది.
అంబులెన్స్లో మృతదేహాన్ని కాలనీకి తీసుకురాగా, ఇంట్లోకి తీసుకెళ్లేందుకు ఇద్దరు కొడుకులు నిరాకరించారు. ఆరు గంటల పాటు అంబులెన్స్లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సత్తమ్మ పాత ఇంటి తాళాలు పగులగొట్టి మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లారు. ఆఖరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకురాకపోవడంతో, బుధవారం ఉదయం ప్రైవేట్ వ్యక్తులతో ఆఖరి మజిలీ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Tollywood | రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. వేదిక ఇదే..!
Morning Drinks For Health | రోజూ ఉదయాన్నే వీటిని తాగండి.. 100 ఏళ్లు జీవిస్తారు..
Tirumala | జనవరి 9న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ : టీటీడీ ఈవో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Jagtial
- Last rites
- Mother
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

