Morning Drinks For Health | చాలా మంది తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఇంకా కొందరు పలు రకాల ఆహారాలను తింటుంటారు. అయితే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం పలు డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం ఈ డ్రింక్స్‌ను తీసుకుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. రోజంతా కొవ్వు కరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం తాగాల్సిన ఆ డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం మీ రోజును గ్రీన్ టీతో ప్రారంభించండి. గ్రీన్ టీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపులను తగ్గిస్తాయి. కణాలు నాశనం కాకుండా ఫ్రీ ర్యాడికల్స్ ను నాశణం చేస్తాయి. దీంతో తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఉదయం గ్రీన్ టీని సేవిస్తే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతూనే ఉంటాయి. శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అలాగే రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ఉదయం బద్దకంగా ఉందని అనుకునే వారు లేదా నీరసంగా ఉండే వారు గ్రీన్ టీని సేవిస్తుంటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అంత సులభంగా అలసట, నీరసం అనేవి రావు. కనుక ఉదయం గ్రీన్ టీని తాగాలి.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకోదగిన డ్రింక్స్‌లో దానిమ్మ రసం కూడా ఒకటి. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి. ఈ పండ్ల రసాన్ని సేవిస్తుంటే రక్త నాళాల్లోని అడ్డంకులు క్లియర్ అవుతాయి. అలాగే ఉదయాన్నే శరీరం తాజాగా ఉన్న అనుభూతి కలిగి యాక్టివ్‌గా మారుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. అదేవిధంగా ఉదయం పాలలో పసుపు కలిపి కూడా తీసుకోవచ్చు. సాధారణంగా దీన్ని రాత్రి పూట తాగుతారు. కానీ ఉదయం కూడా దీన్ని సేవించవచ్చు. పాలలో పసుపు కలిపి ఉదయం తాగితే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. వాపులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా ఈ పాలు మనల్ని రక్షిస్తాయి.
బీట్రూట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో దీని జ్యూస్‌ను తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చు. బీట్రూట్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా రక్షిస్తుంది. అలాగే ఉదయం యాపిల్ సైడర్ వెనిగర్‌ను కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఉదయం తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఇలా తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. బీపీ కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే రుచి కోసం తేనె కలిపి కూడా తాగవచ్చు. ఇలా పలు రకాల డ్రింక్స్‌ను మీరు ఉదయం తాగుతుంటే ఆరోగ్యంగా ఉంటారు. అధిక బరువు తగ్గుతారు. దీంతోపాటు ఆయుర్దాయం కూడా పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.