Telangana Assembly | హైదరాబాద్ : ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ్టి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను రద్దు చేశారు. 10 గంటలకు రైతు భరోసాపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడనున్నారు.
శాసనమండలి ముందుకు నాలుగు సవరణ బిల్లులు రానున్నాయి. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల సవరణ బిల్లులు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, భూ భారతి సవరణ బిల్లులు రానున్నాయి. ఇక హైదరాబాద్ అభివృద్ధిలో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. హైదరాబాద్‌లో ఏడాదిలో మౌలిక వసతుల కల్పనపై చర్చించాలని తీర్మానం ఇచ్చింది. మహాలక్ష్మీ పథకంపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
Home Guard | అధికారంలోకి రాగానే విధుల్లోకి తీసుకుంటామన్నరు.. టవరెక్కిన మాజీ హోంగార్డు
SE Vijay Bhasker Reddy | ఇరిగేషన్లో పంచముఖుడు.. ముఖ్యమంత్రి ఆప్తమిత్రుడని అందలం!
Lagacharla | మళ్లీ రైతుల అరెస్టుకు ప్లాన్? తండాల్లో తాండవిస్తున్న భయానక వాతావరణం