Home Guard | అధికారంలోకి రాగానే విధుల్లోకి తీసుకుంటామన్నరు.. టవరెక్కిన మాజీ హోంగార్డు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలివ్వాలని ఓ మాజీ హోంగార్డు (Home Guard) ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దిగేది లేదంటూ హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వద్ద టవర్‌పైకి ఎక్కి భీష్మించుకు కూర్చున్నారు. రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని కోరారు.
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తమకు ఉద్యోగాలివ్వాలని ఓ మాజీ హోంగార్డు (Home Guard) ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దిగేది లేదంటూ హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వద్ద టవర్‌పైకి ఎక్కి భీష్మించుకు కూర్చున్నారు. రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డుగా విధులు నిర్వహించిన వీరాంజనేయులు.. టవరెక్కి ఆందోళనకు దిగారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహించానని చెప్పారు. 250 మంది హోంగార్డులను సమైక్య పాలకులు అన్యాయంగా తొలగించారని తెలిపారు. పదేండ్లపాటు విధులు నిర్వహించామని వెల్లడించారు. అప్పట్లో అన్ని డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించామని, తమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్లు, హెల్త్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు.
అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమపై కక్షగట్టిన ప్రభుత్వం విధుల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారంలోకి రాగానే తమను విధుల్లోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. ఏడాది గడుస్తున్నా తమను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తమ గురించి అసెంబ్లీలో చర్చించాలని, తొలగించిన 250మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకొని తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

