ములుగు: తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Jathara) తేదీలు ఖరారు అయ్యాయి. మేడారంలో సమ్మక్క, సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. 2026 జనవరి 28వ తేదీన(బుధవారం) శ్రీ సారాలమ్మ దేవత, 29న సమ్మక్క దేవతలు (గురువారం) వారివారి గద్దెల మీదకు చేరుకుంటారు. 30వ తేదీన (శుక్రవారం) మొక్కులు చెల్లించుట, 31వ తేదీన (శనివారం) సమ్మక్క, సారలమ్మ వనదేవతలు, గోవింద రాజు, పగిడిద్దరాజు దేవుళ్లు వన ప్రవేశం చేయడం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పూజారులు నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి..
Fish Venkat | వెంటిలేటర్‌పై ఫిష్ వెంకట్.. సాయం కోసం వేడుకుంటున్న భార్య
కారులోంచి లాగి బాలికపై అత్యాచారం.. మహిళల నుంచి బంగారం దోపిడీ.. బీజేపీ పాలిత మహారాష్ట్రలో దారుణం
Gold Prices | మళ్లీ మెరిసిన బంగారం.. ఒక్కరోజే రూ.1,200దాకా పెరిగిన ధర