Telangana Bhavan | హైదరాబాద్ : గురువారం మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ నాయకులతో సందడిగా ఉన్న తెలంగాణ భవన్లో.. సాయంత్రం నాటికి ఒక గంభీర వాతావరణం ఏర్పడింది. తెలంగాణ భవన్ వద్ద వందల మంది పోలీసులు వాలిపోయారు. పార్టీ కేడర్ కంటే ఖాకీలు ఎక్కువై పోయారు. తెలంగాణ భవన్‌కు నలుమూలలా పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తల్లో ఓ భయానక వాతావరణం సృష్టించేలా పోలీసులు తెలంగాణ భవన్ వద్ద పాగా వేశారు.
ఇక భారీగా పోలీసులు మోహరించడంతో.. బీఆర్ఎస్ నాయకులు అలెర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌తో పాటు మరికొంత మంది నేతలు.. పోలీసుల వద్దకు వెళ్లి.. భవన్ లోపలికి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఎవరి అనుమతితో భవన్‌లోకి వచ్చారని అడిగారు. తమకు ఉన్నతాధికారులు డ్యూటీ వేసిన కారణంగా ఇక్కడికి రావాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.
అయితే ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా ఏసీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పార్టీ కేడర్‌ను నిలువరించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ భవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు pic.twitter.com/obbLJZGXOX
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | కేటీఆర్‌పై కేసు నమోదు.. అసెంబ్లీలో రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
KTR | ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై చర్చకు రెడీ.. రేవంత్ సర్కార్‌కు తేల్చిచెప్పిన కేటీఆర్
KTR | ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు.. ఏ1గా కేటీఆర్