Harish Rao | హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా ఏసీబీ పేర్కొంది. ఇక ఈ అంశాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు శాసనసభలో ప్రస్తావించారు.
మేము ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయుంచి ఎంక్వయిరీ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇదే కదా మీరు చేసేదని మండిపడ్డారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం కేటీఆర్ పని చేస్తే.. ఇవాళ మా కేటీఆర్ మీద అన్యాయంగా కేసు పెట్టారు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా శాసనసభా వేదికగా స్పందించారు. ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు పెడితే.. సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై చర్చకు రెడీ.. రేవంత్ సర్కార్‌కు తేల్చిచెప్పిన కేటీఆర్
KTR | ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు.. ఏ1గా కేటీఆర్