BC Mahasabha | హైదరాబాద్ : కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని తెలంగాణ జాగృతి సంస్థ ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఈ బీసీ మహాసభకు ఇప్పటి వరకు పోలీసు శాఖ అనుమతి ఇవ్వలేదు. గురువారం ఉదయం నుంచి సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద జాగృతి, బీసీ సంఘాల నాయకులు పడిగాపులు కాస్తున్నారు. బీసీ మహాసభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరుతున్నప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. పోలీసుల తీరుపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు బీసీ నాయకులు.
ఇవి కూడా చదవండి..
SSA Strike | వినూత్నంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయుల సమ్మె..
MLC Kavitha | రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ : ఎమ్మెల్సీ కవిత
Rythu Bharosa | రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తులు..! జనవరి 14 నుంచి అమలు..!!