SSA Strike | హైదరాబాద్ : రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయుల సమ్మె కొనసాగుతోంది. 24వ రోజు ఉద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ట్వీట్లను ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ఫొటోలను ఫేస్ మాస్కులుగా ధరించిన నిరసన వ్యక్తం చేశారు.
తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు భారీ ర్యాలీ తీశారు. కలెక్టరేట్ల ఎదుట ఎస్ఎస్ఏ ఉపాధ్యాయుల రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. విద్యాశాఖలో ఎస్ఎస్ఏ ఉద్యోగులను విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎస్ఏ ఉద్యోగులు పలు జిల్లాల్లో వంటా వార్పు కార్యక్రమం కూడా నిర్వహించారు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నారాయణపేట, ఆదిలాబాద్, జనగామ, జోగులాంబ గద్వాలతో పాటు పలు జిల్లాల్లో వంటా వార్పు నిర్వహించారు.
క్యాబినెట్ మంత్రుల చిత్రపటాలను ఫేస్ మాస్క్ లుగా ధరించి కలెక్టరేట్ ఎదుట ఎస్ఎస్ఏ ఉపాధ్యాయుల రిలే నిరాహారదీక్ష
జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల చిత్రపటాలను ఫేస్ మాస్క్ లుగా ధరించి 24వ రోజు రిలే నిరాహారదీక్షను చేపట్టిన సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు
విద్యాశాఖలో… pic.twitter.com/1MnpaZ4j4n
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2025
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | రైతు భరోసాకు షరతులా..? సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
Rythu Bharosa | రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తులు..! జనవరి 14 నుంచి అమలు..!!
Vinod Kumar | తెలంగాణ హైకోర్టులో జడ్జిల నియామకానికి చర్యలు చేపట్టాలి : వినోద్ కుమార్