Group-1 Aspirants | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని అశోక్ నగర్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పోలీసుల దాడుల్లో పలువురు అభ్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జీవో 29 రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని అభ్యర్థులు తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అశోక్ నగర్ దద్దరిల్లిపోతోంది.
గ్రూప్ -1 అభ్యర్థులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు అడుగడుగునా పోలీసులు భారీ మోహరించారు. ఒక ఇద్దరు అభ్యర్థులు కనిపిస్తే చాలు.. వారిని వెంబడించి అరెస్టులు చేస్తున్నారు. ఆందోళనలకు దిగితే లాఠీ దెబ్బలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీచార్జి చేస్తున్న పోలీసులు pic.twitter.com/Rr7p8Lss16
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2024
అశోక్ నగర్లో జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు https://t.co/hLK935IRRw pic.twitter.com/r6jpRqy7Gm
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2024
ఇవి కూడా చదవండి..
Telangana | 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం.. ఓయూ వైస్ ఛాన్సలర్‌గా కుమార్
Harish Rao | గురివింద గింజ తన కింద నలుపు తెల్వదన్నట్టు.. రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్