Jagadish Reddy | హైదరాబాద్ : నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడే అదే అశోక్ నగర్, నిరుద్యోగుల పేరు వింటే ఆయనకు భయమేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర అప్పులు, గ్రూప్-1 అంశంతో పాటు మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
రేవంత్ వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజల పరువు పోయేలా రేవంత్ ఉపన్యాసాలు ఉన్నాయి. రేవంత్ వ్యక్తిగా పరువు పోగొట్టుకుంటే ఫర్వాలేదు.. కానీ తెలంగాణ సీఎంగా పరువు పోతే ఎవరికి నష్టం..? ఎవరో రాసిచ్చిన పాఠం చదవడం రేవంత్ మానేస్తే మంచిది. సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ఆదాయాన్ని పెంచింది కేసీఆర్ అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. 2014 బడ్జెట్ ఇప్పటి బడ్జెట్ చూస్తే ఎవరు ఆదాయం పెంచారో తెలుస్తుంది. అప్పులు మంత్రుల జేబులో నుండి కడుతున్నట్లు అతితెలివిగా మాట్లాడుతున్నారు. మేము కూడబెట్టిన ఆదాయం నిలబడితే చాలు. 420 హామీలోద్దు.. కేసీఆర్ పథకాలైనా ఇస్తే చాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ఆదాయం , అప్పులపై చర్చకు సిద్ధమే అని జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.
సెక్యూరిటీ లేకుండా సీఎం మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలిరగాలి. మూసీ కూల్చివేతల తరవాత సెక్యూరిటీ పెంచుకుని ప్రగల్భాలు పలుకుతున్నారు. అశోక్ నగర్ నిరుద్యోగుల వల్లే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు అశోక్ నగర్ పేరు వింటే రేవంత్‌కి భయమేస్తోంది. అశోక్ నగర్లో పోలీస్ నిర్బంధం దేనికి..? యువత ఆవేశం ఇలానే కొనసాగితే తెలంగాణ మొత్తం అశోక్ నగర్లే అవుతాయి. నిర్బంధం పెట్టే బదులు అనుమానాలు నివృత్తి చేయండి. కాంగ్రెస్ సీనియర్లే సీఎం ఏకపక్షంగా వెళ్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ప్రజల నుండి దూరమౌతున్న రేవంత్.. తన దూకుడు మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి దూరం కాక తప్పదని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | తిమ్మిని బమ్మిని చేయబోయి బొక్కబోర్లాపడ్డ రేవంత్ రెడ్డి: హరీశ్‌రావు
Harish Rao | మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌కు వెళ్దాం.. రేవంత్ రెడ్డికి హరీశ్ సవాల్
Group-1 Aspirants | సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు.. సోమవారం విచారిస్తామన్న సీజేఐ