Harish Rao | హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి గుండు సున్న వచ్చిన పార్టీ ఎక్కడైనా ఉందా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ప్రధాన ప్రతిపక్షానికి ఒక్కసీటు రాని సందర్భం తెలంగాణలో బీఆర్ఎస్కు మాత్రమే ఉందట. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు. మధ్యప్రదేశ్‌లో కూడా ఒక్క సీటు రాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీనే ఉంది కదా..? గురివింద గింజ తన కింద నలుపు తెల్వదన్నట్టు.. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నడో అర్థః కావడం లేదు. ఏదైనా మాట్లాడేముందు హోం వర్క్ చేయాలి.. ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యమంత్రిని కదా.. ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు. ఏది మాట్లాడినా చెల్లుతది అనుకోవద్దు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
నగరం మధ్య నుంచి నది పోతున్నది ఒక్క హైదరాబాద్‌లోనే ఉందని సీఎం అంటుండు. గంగా, గోదావరి, కృష్ణా అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తున్నాయి. ఆ మాత్రం అవగాహన ముఖ్యమంత్రికి లేదా..? ఆ స్క్రిప్టు రైటర్లు సరిగా లేకపోతే వారినైనా మార్చుకోవాలి. ఏ నగరం గుండా ఏ నది పోతుందో.. ఆ వివరాలను సీఎంకు పంపిస్తాను. చదువుకోండి.. ఇంకోసారి తప్పు మాట్లాడొద్దని హరీశ్‌రావు హితవు పలికారు.
రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి గుండు సున్న వచ్చిన పార్టీ ఎక్కడైనా ఉందా అన్న రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు
గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం.. కానీ అక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి… pic.twitter.com/kXjn4QC9dE
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | తిమ్మిని బమ్మిని చేయబోయి బొక్కబోర్లాపడ్డ రేవంత్ రెడ్డి: హరీశ్‌రావు
Harish Rao | మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌కు వెళ్దాం.. రేవంత్ రెడ్డికి హరీశ్ సవాల్