వనపర్తి : కాంట్రాక్టు బిల్లుల విషయంలో లంచం తీసుకుంటూ పెబ్బేరు(Pebberu) మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు(Adiseshu) ఏసీబీ అధికారులకు(ACB) పట్టుబడ్డాడు. ఏసీబీ అదనపు ఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెబ్బేరుకు చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ ఒకరు తనకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. అందుకు కమిషనర్ ఆదిశేషు రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రూ.20,000 లంచం తీసుకుంటుండగా కమిషర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులపై పోరాటం చేస్తా : కేటీఆర్