యాదాద్రి భువనగిరి : ప్రాణాలను పణంగా పెట్టి అయినా అంబుజా సిమెంట్ పరిశ్రమను(Ambuja Cement) అడ్డుకుంటామని బీఆర్ఎస్( BRS) శ్రేణులు స్పష్టం చేశారు. రామన్నపేటలో(Ramannapet) అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాణాలైనా అర్పిస్తాం అంబుజాని అడ్డుకుంటాం, అంబుజా వద్దు- ఆరోగ్యం ముద్దు.. అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు.
నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, సాగునీరు ఇచ్చి రైతులకు చేయూత అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. సిమెంట్ పరిశ్రమతో ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును మానుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | అందిన కాడికి దోచుకో.. బామ్మర్ది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులపై పోరాటం చేస్తా : కేటీఆర్
KTR | ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.. ఇదిగో సాక్ష్యం : కేటీఆర్